టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా పరాజయాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామ్ హీరోగా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో పూరి తీసిన మాస్ యాక్షన్ సినిమా డబుల్ ఇస్మార్ట్ మూవీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది.
అలానే అంతకుముందు విజయ్ దేవరకొండ తో పూరి తీసిన లైగర్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఆ విధంగా కెరిర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ త్వరలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ఒక మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి నాగార్జున కలిసి ఒక అద్భుతమైన యాక్షన్ స్టోరీ లైన్ వినిపించారని అది ఎంతో నచ్చిన నాగార్జున పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం.
ఈ మూవీని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందట. త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. కాగా గతంలో నాగార్జునతో పూరి జగన్నాథ్ తీసిన శివమణి సినిమా మంచి విజయం అందుకోగా ఆ తర్వాత వారిద్దరి కాంబోలో అవీచిన సూపర్ యావరేజ్ మూవీగా నిలిచింది. మరి వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.