ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఇప్పటికే విశేష స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులని అలరించడం మాత్రమే కాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ఫైనల్ నామినేషన్‌లకు కూడా చేరిందని మనకు ఇప్పటికే తెలుసు.
ఎం ఎం కీరవాణి స్వరపరిచిన పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకోవడానికి మరో 4 అంతర్జాతీయ పాటలతో పోటీ పడుతోంది. ఇప్పుడు, ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమిటంటే, ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. గాయకులు కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ అవార్డు వేదిక పై నాటు నాటు పాటను పాడతారు. తెలుగు సినీ ప్రేమికులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం అనే చెప్పాలి.
ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎం ఎం కీరవాణి మరియు ఇతరులు మార్చి 12, 2023న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్న ఆస్కార్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రకటించినప్పటి నుండి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన తారలను ఈ పాటకు పెర్ఫార్మెన్స్ చేయమని కోరుతున్నారు.
ఎస్ ఎస్ రాజమౌళి యొక్క ఆర్ ఆర్ ఆర్ ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్‌ల పై తీసిన ఒక కల్పిత గాథ. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ప్రధాన రెండు పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాని ఆస్కార్స్ 2023లో 14 కేటగిరీలలో చిత్రాన్ని సమర్పించారు మరియు ఒక నామినేషన్‌ను పొందారు. RRR మార్చి 3న USలో మళ్లీ విడుదల కానుంది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో పాటు, ఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, శ్రియా శరణ్ మరియు సముద్రఖని సహాయక పాత్రల్లో నటించారు.