టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకోగా నేడు మూవీ నుండి నానా హైరానా అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.
కార్తీక్, శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటకి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఎస్ థమన్ అందించిన ఈ మెలోడియస్ ట్యూన్ యువతని ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రోజు రోజుకు అందరిలో అంచనాలు మరింతగా పెంచేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం ఖాయం అంటున్నారు మూవీ టీమ్. కాగా ఈ మూవీలో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.