ఈ వారం, OTT వేదికలలో ప్రేక్షకులను అలరించడానికి 5 ప్రముఖ విడుదలల జాబితా సిద్ధంగా ఉంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో 4 సినిమాలు మరియు ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్, రిషబ్ శెట్టి యొక్క కాంతార, దుల్కర్ సల్మాన్ మరియు సన్నీ డియోల్ ల చుప్, నీరజ్ పాండే యొక్క వెబ్ సిరీస్ ఖాకీ మరియు నివిన్ పౌలీ యొక్క పడవెట్టు ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాయి.
ఇటీవలే థియేటర్లలో విడుదలైన ప్రిన్స్, శివ కార్తికేయన్ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది.
శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో, అనుదీప్ కెవిఎస్ దర్శకత్వంలో, ప్రిన్స్ తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ఒకేసారి విడుదలైంది. గతంలో తెలుగులో జాతి రత్నాలు చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ కి తమిళ చిత్ర పరిశ్రమలో ఇదే తొలి చిత్రం. ప్రిన్స్ తెలుగు మరియు తమిళ భాషలలోని విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది.
ఇక గత రెండు నెలలు గా ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన తెచ్చుకున్న రిషబ్ శెట్టి యొక్క కాంతార, చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 30 న విడుదలైనప్పటి నుండి, కాంతార చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది మరియు ప్రేక్షకుల నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను అందుకుంది. కాంతార చిత్రం OTTలో నవంబర్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
సన్నీ డియోల్, శ్రేయ ధన్వంతరి మరియు దుల్కర్ సల్మాన్ యొక్క అసాధారణమైన సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్, చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, అతి త్వరలోనే OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 న విడుదలైంది మరియు ఇది అభిమానుల నుండి మరియు సమీక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 ఇటీవలే సినిమా విడుదల తేదీని ప్రకటించింది. చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నవంబర్ 25 నుండి ZEE5లో అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ ఇలా మొత్తంగా అయిదు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
నీరజ్ పాండే తాజాగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్, ఖాకీ: ది బీహార్ చాప్టర్‌ను నిర్మించారు, ఇది నవంబర్ 25, 2022న విడుదల కానుంది. ఈ షోలో కరణ్ టాకర్ మరియు అవినాష్ తివారీ కీలక పాత్రల్లో నటించారు మరియు అమిత్ లోధా రాసిన బీహార్ డైరీస్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది.
మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన పడవెట్టు సినిమా కూడా OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది. లిజు కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం మరియు రచనా బాధ్యతను నిర్వర్తించారు. ఇది అతనికి దర్శకుడిగా తొలి చిత్రం. ఈ చిత్రం ఫిబ్రవరి 2020 నుండి మార్చి 15, 2022 మధ్య ఉత్తర కేరళలో చిత్రీకరించబడింది.
ఈ చిత్రానికి దర్శకుడు మరియు రచయిత అయిన లిజు కృష్ణ ఈ చిత్రాన్ని తన స్వగ్రామమైన మలూర్, కన్నూర్ కేరళ మరియు గ్రామానికి చెందిన సుమారు వెయ్యి మందితో చిత్రీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ సినిమా కోసం వారందరికీ నటనలో శిక్షణ ఇప్పించారట. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో పెద్దగా ఆడకపోయినా, OTTలో రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.