ఈ సంక్రాంతికి విడుదలవుతున్న రెండు సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’, మరొకటి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి. అయితే తాజాగా వారిసు విడుదల తేదీ పై కాస్త గందరగోళం కారణంగా గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచింది.
దిల్ రాజు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నిర్మాత, ఆయనకు ఒక సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో బాగా తెలుసు కాని వారిసు విషయంలో మాత్రం ఆయన పూర్తిగా గందరగోళానికి గురయ్యారు. అజిత్ తునివు కారణంగా వారిసు సినిమా ముందుగా అనుకున్న విడుదల తేదీ మార్చారు. దీంతో ఇది సినిమా విడుదల పై భారీ గందరగోళాన్ని సృష్టించింది.
ఈ సమస్యలన్నింటి వెనుక థమన్ అతి పెద్ద కారణం అని అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయన వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది మరియు సోమవారం నాటికి అన్ని పనులూ పూర్తవుతాయని వారు భావిస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది కానీ కంటెంట్ ఇంకా రెడీ కాలేదు.
జనవరి 11న తమిళ వెర్షన్ ను విడుదల చేసి, అవసరం అయితే తెలుగు వర్షన్ ను జనవరి 14 కి వాయిదా వేయడానికి చిత్ర బృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
అయితే, విదేశీ కొనుగోలుదారులు ఇంకా కంటెంట్ తమకు పంపిణీ కానందున సినిమా ఫలితం గురించి గురించి ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే వారు కంటెంట్ అందుకున్న తర్వాత మాత్రమే కొన్ని ఏరియాలలో బుకింగ్లను ఓపెన్ చేయగలరు.
దిల్ రాజు అండ్ టీం కలిసి వారిసు చిత్రీకరణ కోసం దాదాపు 3 సంవత్సరాలు పట్టింది, కానీ వారు సినిమా పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం నెటిజన్లను మరియు పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థమన్ ఒకేసారి రెండు మూడు చిత్రాలను హ్యాండిల్ చేయలేకపోతున్నారని, అందుకే ఆయన తన పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోతున్నారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.