Homeసినిమా వార్తలుKeeravani: పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

Keeravani: పద్మశ్రీ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

- Advertisement -

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్ఎమ్ కీర‌వాణి ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పద్మశ్రీ అవార్డుల‌ను రాష్ట్రపతి భవన్‌లో ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసినందుకు భారత రాష్ట్రపతి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేశారు.

కాగా సంగీత పరిశ్రమలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా బుధవారం నాడు ఎంఎం కీరవాణికి ఈ అవార్డు లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎం ఎం కీరవాణి స్వరపరచగా.. ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి నాటు నాటు పాట అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డును కూడా గెలుచుకుంది.

READ  RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్నేహం కేవలం ఆర్ ఆర్ ఆర్ కోసం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా?

“నాటు నాటు” పాటకి కీరవాణి అందించిన ఫుట్-టాపింగ్ కంపోజిషన్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ అద్భుతమైన హుషారుతో పాడిన విధానం, ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీ మరియు చంద్రబోస్ సాహిత్యం ఈ పాటను పర్ఫెక్ట్ డ్యాన్స్ ట్రాక్‌గా మార్చి విజయవంతం చేశాయి.

కీరవాణి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో జన్మించిన తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. సంగీత దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. ఇండ‌స్ట్రీలో సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కే రాఘవేంద్ర రావు గారితో సహా ఎందరో దర్శకుల సినిమాలకు అద్భుతమైన పాటలు అందించిన కీరవాణి.. గత కొన్నేళ్లుగా కేవలం ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలకే సంగీతం అందిస్తూ వస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  RRR Re Release: USAలో 200కి పైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories