సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ల క్లాసికల్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మళ్ళి థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అందాల నటి సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించగా రామ్ ప్రసాద్ ఆర్ట్స్ సంస్థ పై ఎన్ రామలింగేశ్వరరావు దీనిని గ్రాండ్ గా నిర్మించారు.
ఇక రీ రిలీజ్ లో ఫస్ట్ డే నుండి అదరగొడుతూ థియేటర్స్ లో దూసుకెళ్తోంది మురారి మూవీ. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు సహజ నటనతో పాటు సోనాలి అందం, డైరెక్టర్ కృష్ణవంశీ టేకింగ్, మణిశర్మ సాంగ్స్, విజువల్స్, ఎమోషన్స్ వంటివి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ మూవీ గడచిన మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 8 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.
ఇప్పటివరకు రీ రిలీజ్ మూవీస్ లో ఇది టాప్ రికార్డు అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో క్లోజింగ్ కి మురారి ఎంత రాబడుతుందో చూడాలి. ఇక అతి త్వరలో మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇంద్ర, పవన్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్, నాగ్ బర్త్ డే సందర్భంగా మాస్ సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరి అవి ఎంతవరకు మురారి రికార్డ్స్ ని బద్దలుకొడుతాయో చూడాలి.