టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసికల్ మూవీ మురారి 2001 ఫిబ్రవరి లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.
రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్ రామలింగేశ్వరరు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు కృష్ణవంశీ అద్భుత టేకింగ్, మణిశర్మ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యక్షన్, లవ్, ఎమోషనల్ అంశాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మురారి మూవీని థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా మొదటి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 5.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రీ రిలీజ్ లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా రికార్డు సృష్టించింది.
ఇక రెండో రోజు కూడా మురారి మూవీ బాగానే కలెక్షన్ రాబట్టడం విశేషం. కాగా రెండవ రోజు నైజాంలో రూ. 1.3 కోట్లు, అలానే వరల్డ్ వైడ్ గా రూ. 1.75 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి మొత్తంగా రెండు రోజుల్లో రూ. 7 కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకుని దూసుకెళుతోంది. మరి ఈ మూవీ క్లోజింగ్ కి ఎంతమేర రాబడుతుందో చూడాలి.