టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ, చరిష్మా గురించి తెలిసిందే. వాస్తవం చెప్పాలి అంటే నెగటివ్ టాక్ తో కూడా వందకోట్లకు పైగా షేర్ రాబట్ట గల అన్ని వర్గాల ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఆయన నుండి సినిమా వస్తుంది అంటే చాలు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఆడియన్స్ లో విపరీతమైన జోష్, ఆసక్తి ఉంటుంది.
ఇక టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన మహేష్ బాబు, ఇటీవల రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ని పోకిరితో స్టార్ట్ చేసి అదరగొట్టారు. తాజాగా నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి ఆయన నటించిన కల్ట్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు. ఇప్పటికే హైదరాబాద్, నైజాం, ఆంధ్ర, ఓవర్సీస్ సహా అనేక ప్రాంతాల్లో బుకింగ్స్ అదరగొట్టిన ఈ మూవీ యొక్క సెలబ్రేషన్స్ ని ఆయన ఫ్యాన్స్ కనీ వినీ ఎరుగని రీతిలో చేస్తున్నారు.
తమ ప్రియతమ సూపర్ స్టార్ పై తమకున్న అమితమైన ప్రేమాభిమానాలను చూపిస్తూ, డ్యాన్స్ లు ఈలలు, గోలు, కేరింతలు, భారీ సెలబ్రేషన్స్ తో ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతంలో కూడా అదరగొడుతున్నారు. ప్రస్తుతం మురారి మూవీ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ హంగామాకి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.