మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే దీని తరువాత యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు మెగాస్టార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పై కసరత్తు చేస్తున్నారు అనిల్.
ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో మెగాస్టార్ కి జోడీగా నటించే హీరోయిన్ పై ఇటీవల కొన్నాళ్లుగా పలువురి పేర్లు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. ఇక లేటెస్ట్ గా సీతారామం, హాయ్ నాన్న మూవీస్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ అంటూ కొందరు కథనాలు ప్రచారం చేసారు.
అయితే అది నిజం కాదని, లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉండగా కీలక పాత్రల్లో భూమిక, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ రేవంత్ నటించనున్నారట. త్వరలో వీరికి సంబంధించి అఫీషియల్ గా అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.