Homeసినిమా వార్తలుRana Naidu: వెంకటేష్ - రానా వెబ్ సిరీస్ రానా నాయుడు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

Rana Naidu: వెంకటేష్ – రానా వెబ్ సిరీస్ రానా నాయుడు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్టార్ హీరో ఎంతో మంచి నటుడిగా పేరు పొందిన విక్టరీ వెంకటేష్ నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. కాగా ప్రత్యేకమైన ప్రమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేయడంలో నిర్వాహకులు విజయవంతం అయ్యారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సీరీస్ ను చూస్తామా అని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

కాగా నిజ జీవితంలో వెంకటేష్ సోదరుడి కొడుకు అయిన మరో తెలుగు నటుడు రానా దగ్గుబాటి.. ఈ క్రైమ్/ఫ్యామిలీ డ్రామాలో ఆయనకు కొడుకుగా కనిపించనున్నారు. 10 ఎపిసోడ్ల నిడివి గల ఈ సిరీస్ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉన్న ఈ హిందీ సిరీస్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని చాలా మంది నెటిజన్లు భావించారు.

ఎందుకంటే వెబ్ సిరీస్ ల ప్రసారానికి అదే రెగ్యులర్ టైమింగ్, కానీ వారందరికీ చిన్న నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ ఈ రోజు మధ్యాహ్నం 01:30 గంటలకు విడుదల కానుందని దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ధృవీకరించింది. కాబట్టి వెంకటేష్, రానాల మధ్య వైరాన్ని చూడాలంటే ప్రేక్షకులు మరికొన్ని గంటలు ఎదురు చూడక తప్పదు.

READ  Nani: ఇండస్ట్రీలో నెపోటిజం గురించి పర్ఫెక్ట్ లాజిక్ ఇచ్చిన నాచురల్ స్టార్ నాని

కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించిన రానా నాయుడు ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ యొక్క భారతీయ అనుసరణగా తెరకెక్కింది. సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు.

ఈ వెబ్ సీరీస్ బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ ఒక సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నిలిచే రానా నాయుడు (రానా) కథని వివరిస్తుంది. ఎప్పుడో విడిపోయిన తన తండ్రి నాగ (వెంకటేష్) మళ్ళీ తన జీవితంలోకి రావడంతో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు అనే నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Balagam: బాక్సాఫీసు వద్ద అద్భుత వసూళ్లు సాధిస్తున్న చిన్న సినిమా బలగం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories