టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నిర్మితం కానుందని ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ ప్రాజెక్టు అయితే పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తోంది. కాగా కారణాలు ఏవి తెలియరాలేనప్పటికీ మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని నేడు అనౌన్స్ చేసారు ఆయన తండ్రి బాలకృష్ణ.
ఆదిత్య 369 కి సీక్వెల్ అయిన ఆదిత్య 999 మ్యాక్స్ మూవీని నేడు కాకినాడ లో జరిగిన ఒక కార్యక్రమంలో అనౌన్స్ చేశారు. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ వాస్తవానికి నేడు ఆ మూవీ యొక్క ప్రారంభం ప్రారంభం జరగాల్సి ఉందని, అయితే మోక్షజ్ఞ కి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా మూవీని అనౌన్స్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
కాగా ఈ మూవీని బాలకృష్ణ స్వయంగా తెరకెక్కిస్తూ అందులో ఒక కీలక పాత్ర వహిస్తుండగా మోక్షజ్ఞ హీరోగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో వెల్లడిగా కానున్నాయి.మొత్తంగా మోక్షజ్ఞ తన తండ్రి దర్శకత్వం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండడంతో అందరిలో ఈ మూవీపై భారీ స్థాయి ఆసక్తి ఏర్పడింది.