గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు యువ కథానాయకుడు తేజ సజ్జ. మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన హనుమాన్ మూవీ దాదాపుగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని ఆయన మార్కెట్ రేంజ్ ను మరింతగా పెంచింది. తాజాగా కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జ చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ మిరాయ్.
Mirai New Release Date
ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుని సినిమా పై బాగానే అంచనాలు ఏర్పరిచింది. ఇందులో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని ఆగస్టు 1 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమా అశోకుడు మరియు ఆయన రహస్య తొమ్మిదికి సంబంధించి సాగుతుంది. కళింగ యుద్ధం అశోకుడికి చరిత్రలో ఒక చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే ఓ దైవిక రహస్యం వెల్లడవుతుంది, అంటే తొమ్మిది గ్రంథాల యొక్క విస్తారమైన జ్ఞానం మనిషిని దైవికంగా చేస్తుంది. తరతరాలుగా వారిని రక్షించడానికి తొమ్మిది మంది యోధులను నియమిస్తారు.
Mirai Story and Concept Details
ఒక గ్రహణం అటువంటి జ్ఞానాన్ని సమీపించి, ఆ తరువాత గ్రహణాన్ని ఆపివేసే జన్మను తీసుకుంటుంది. ఇది తరతరాలుగా అనివార్యమైన గొప్ప యుద్ధం. గ్రహణం అశోకుడి రహస్యం తొమ్మిదికి చేరకుండా ఆపడానికి అక్కడ ఉన్న ఒక సూపర్ యోధుడిగా తేజ సజ్జ ఇందులో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని 18 ఏప్రిల్ 2025 న రిలీజ్ చేయనున్నట్లు అంతకముందు మేకర్స్ ప్రకటించారు.
Mirai Movie Casting Details
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగస్టు 1 కి వాయిదా పడింది. ఇక ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, చైనీస్, వంటి ఎనిమిది భాషల్లో 2డి మరియు 3డి వర్షన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక డేట్ పరంగా చూసుకుంటే ఆగష్టు 1 అన్ని విధాలా మిరాయ్ కి కలిసి వచ్చే డేట్. మరోవైపు ఆ నెలలో రక్షా బంధన్, ఆగష్టు 15 వంటి పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం అది.
గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు, ఇందులో హీరో తేజ సజ్జ పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్తుంది టీం. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.