ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ బాగానే రెస్పాన్స్ సంపాదించుకుంది.
దీనిని వచ్చేది సమ్మర్ తర్వాత ఆడియన్స్ ముందుకు తీసుకురవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు లేటెస్ట్ గా ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా అనౌన్స్ చేశారు మెగాస్టార్. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం విశ్వంభర అనంతరం మెగాస్టార్ ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారని తెలుస్తోంది.
సాహు గారపాటి నిర్మాతగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ ఎంటర్టైనర్ మూవీలో మెగాస్టార్ తన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకోనున్నారట. అనిల్ రావిపూడి కూడా మెగాస్టార్ ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసారని టాక్. ఇక త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. మొత్తంగా యువ హీరోలకి ధీటుగా మెగాస్టార్ చిరంజీవి వరుసగా ప్రాజక్ట్స్ ని ఎంచుకుంటూ కొనసాగుతున్నారు.