టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని వచ్చేడాది సమ్మర్ తర్వాత ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతుంది.
ఇక దీని అనంతరం తాజాగా యువ నటుడు నాని సమర్పణలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుదర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేశారు.
దీనికి సంబంధించిన ఆ పోస్టర్ అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రెడ్ షేడ్ లో మెగాస్టార్ చేతిని ఆ కాన్సెప్ట్ పోస్టర్ లో చూడవచ్చు, దీనిని బట్టి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పెరిగిన తాను ఆయన్ని అందరూ ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అటువంటి అద్భుతమైన పాత్రలో చూపించబోతున్నట్లు చెబుతున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇక ప్రస్తుతం నానితో ఆయన ప్యారడైజ్ అనే మూవీ తీస్తున్నారు. అది కంప్లీట్ అయిన అనంతరం మెగాస్టార్ మూవీ ప్రారంభం కానుంది