మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘లూసిఫర్’కి రీమేక్‌గా రూపొందిన గాడ్‌ఫాదర్‌కు యు/ఎ సర్టిఫికేట్ లభించింది. మరియు సెన్సార్ సభ్యుల నుండి వినిపిస్తున్న టాక్ నిజమైతే మెగా అభిమానులు పండగ చేసుకునే సినిమా వచ్చేసినట్లు కనిపిస్తుంది.
ఇండస్ట్రీలో ఈ సినిమా పై చాలా పాజిటివ్ బజ్ నడుస్తోంది. మళయాళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు మోహన్ రాజా సరైన మార్పులు చేశారని పరిశ్రమలోని అంతర్గత వర్గాలు కొనియాడుతున్నారు. మాతృకలో లేని చాలా కమర్షియల్ అంశాలు తెలుగు వెర్షన్ లోకి జోడించబడ్డాయని తెలుస్తొంది. మరియు ఈ చిత్రంలోని కీలక అతిథి పాత్రకి సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ను తీసుకోవడం కూడా చక్కని వ్యూహాత్మక ఎత్తుగడగా అనుకోవచ్చు.
మాస్ ప్రేక్షకులు మెచ్చే హీరోయిజం ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందరిన అలరిస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా ద్వితీయార్థం మెగా అభిమానులకు ఒక పండగలా ఉండబోతోందని గట్టిగా చెబుతున్నారు.
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కూడా కనిపించనున్నారు. మెగాస్టార్ సినిమా నుండి అభిమానులు ఏవైతే ఆశిస్తారో తెలుసుకున్న దర్శకుడు ఈ రీమేక్ ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించారని చెప్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు సూపర్ గుడ్ ఫిలింస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
కాగా గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ హక్కులని నెట్‌ఫ్లిక్స్ ఓటిటి సంస్థ ఏకంగా 57 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇందులో తెలుగు మరియు హిందీ వెర్షన్ హక్కులు కలిపి ఉన్నాయి. దసరా సీజన్‌లో విడుదల కానుండడం గాడ్‌ఫాదర్ సినిమాకి మంచి ప్రయోజనం లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత.. మెగా అభిమానులు చిరంజీవి తిరిగి సూపర్ హిట్ సినిమా ఇస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరియు సెన్సార్ టాక్ నిజమైతే ఈసారి చిరంజీవి తన అభిమానులను నిరాశపరచరు అనే చెప్పచ్చు.