వాల్తేరు వీరయ్య భారీ విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆచార్య పరాజయం, గాడ్ ఫాదర్ కూడా అంతకంటే తక్కువగా ప్రదర్శింపబడిన తర్వాత తిరిగి వాల్తేరు వీరయ్యతో కమ్ బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ ఇక ఎంటర్ టైన్ మెంట్ రూట్ ను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారని, భోళా శంకర్ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారని అంటున్నారు.
భోళా శంకర్ తో కూడా స్మాష్ హిట్ అందించాలని చిరంజీవి ఉవ్విళ్లూరుతున్నారని, అందుకే ఎంటర్ టైన్ మెంట్ డోస్ పెంచేలా కొన్ని పార్ట్స్ ను రీవర్క్ చేస్తున్నారని సమాచారం. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు చిరంజీవి ఎంటర్ టైనింగ్ క్యారెక్టరైజేషన్, కామెడీ సీన్స్ వాల్తేరు వీరయ్య సినిమాకి మంచి ప్రేక్షకాదరణ వచ్చేలా చేశాయి. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ వాల్తేరు వీరయ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని మరింత పెంచింది.
అందుకే ఇప్పుడు భోళా శంకర్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్న చిత్రబృందం షూటింగ్ పూర్తి చేయడానికి మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాను మొదట మేలో విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ రిలీజ్ ప్లాన్ ను చిత్ర బృందం ఆగష్టుకు వాయిదా వేసిందని తెలుస్తోంది.
అజిత్, శ్రుతిహాసన్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. తెలుగు రీమేక్ లో కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2013లో విడుదలైన షాడో తర్వాత దర్శకుడిగా వెండితెరకు రీఎంట్రీ ఇవ్వనుంది.