Homeసినిమా వార్తలుమెగాస్టార్ - అనిల్ రావిపూడి మూవీ షూట్ ప్రారంభం 

మెగాస్టార్ – అనిల్ రావిపూడి మూవీ షూట్ ప్రారంభం 

- Advertisement -

ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 

ఇప్పటికే వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక లేటెస్ట్ గా అనిల్ రావిపూడి తో సుస్మిత కొణిదల, సాహు గారపాటి నిర్మించనున్న ఫ్యామిలీ యాక్షన్ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అందించారు మెగాస్టార్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దీనికి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి గ్రాండ్ గా ప్రారంభమైంది. మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ అందరూ కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ ఇందులో జోడిస్తూ ముఖ్యంగా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో దర్శికుడు అనిల్ రావిపూడి తెలుస్తోంది. 

రానున్న 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ద్వారా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. మరి మెగాస్టార్ మూవీతో ఆయన ఏ స్థాయి విజయం అనుకుంటారో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  'హరి హర వీర మల్లు' : 'అసుర హననం' సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే ?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories