Homeసినిమా వార్తలుమెగాస్టార్ - అనిల్ రావిపూడి నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

మెగాస్టార్ – అనిల్ రావిపూడి నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మెగాస్టార్ కుమార్తె సుస్మిత తో కలిసి సాహూ గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని వేగంగా జరుపుకున్న ఈ సినిమాకు తదుపరి షెడ్యూల్ రేపు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్, నయనతార తో పాటు వెంకటేష్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

ఇందులో ఆయన క్యామియో పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇటీవల సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మూవీతో కూడా మరొక సంచలన విజయం తన ఖాతాలో వేసుకోవటం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

READ  అఫీషియల్ : AA 22 లో దీపికా పదుకొనె 

ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మరి అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ క్రేజీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories