Homeసినిమా వార్తలుమెగాస్టార్ 157 ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 

మెగాస్టార్ 157 ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 

- Advertisement -

ఓవైపు మల్లిడి వశిష్ట ఠీ విశ్వంభర మూవీ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు అనిల్ రావిపూడితో ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీని సాహు గారపాటితో కలిసి మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈమూవీ ప్రస్తుతం మూడవ షెడ్యూల్ కి సిద్దమయింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. కాగా ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి డ్రిల్ మాస్టర్ గా కనిపించనున్నారని, అలానే ఆయన పాత్ర పేరు వరప్రసాద్ అని టాక్.

అయితే మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనేది తెలిసిందే. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తన మార్క్ కామెడీతో పాటు మెగాస్టార్ మార్క్ యాక్షన్ అంశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది. 

Follow on Google News Follow on Whatsapp

READ  భారీ ధరకు అమ్ముడైన 'కూలీ' తెలుగు హక్కులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories