Homeసినిమా వార్తలుమజాకా : టాక్ ఫుల్ కానీ కలెక్షన్స్ డల్ 

మజాకా : టాక్ ఫుల్ కానీ కలెక్షన్స్ డల్ 

- Advertisement -

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించిన తాజా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఈ మూవీలో రావు రమేష్, అన్షు కీలకపాత్రల్లో కనిపించగా దీనికి లియోని జేమ్స్ సంగీతం సమకూర్చారు. 

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరిని ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మజాకా మూవీ ప్రీమియర్స్ నుండి మంచి సక్సెస్ టాక్ అయితే సంపాదించుకుంది. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కామెడీ బాగానే ఎలివేట్ అవ్వడంతో మజాకా మూవీ అందరి నుంచి మంచి స్పందన అందుకుంది. 

అయితే కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాబట్టట్లేదు అని చెప్పాలి. ఓపెనింగ్స్ పరంగా పరవాలేదని పించిన మజాకా సినిమా సాంగ్స్ కూడా అంతగా మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా ధమాకాలో భీమ్స్ సిసిలోరియో అందించిన సాంగ్స్ ఆకట్టుకోగా ఇందులో మాత్రం లియోన్ జేమ్స్ పెద్దగా మెప్పించలేకపోయారనేది ఒక మైనస్ అని చెప్పాలి. 

READ  Chhaava OTT Partner and Release Details 'ఛావా' ఓటిటి పార్టనర్ & రిలీజ్ డీటెయిల్స్ 

మరోవైపు తాజాగా తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ థియేటర్స్ లో అదరగొడుతూ ఉండడం కూడా ధమాకా అంతగా కలెక్షన్ రాకపోవటానికి మరొక కారణం. అయితే త్వరలో వీకెండ్ కావడంతో ఆ సమయంలో ధమాకా ఎంత మేర రాబడుతుందో చూడాలి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories