Homeసినిమా వార్తలుమరొక ఓటిటిలో కూడా అందుబాటులోకి వచ్చిన 'మజాకా'

మరొక ఓటిటిలో కూడా అందుబాటులోకి వచ్చిన ‘మజాకా’

- Advertisement -

సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. 

ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగున్నప్పటికీ కథనంలో కొన్ని లోపల వలన ఆడియన్స్ ని ఈ మూవీ అలరించలేకపోయింది. సందీప్ కిషన్ తో పాటు మిగతా పాత్రధారులు అందరూ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓవరాల్ గా త్రినాధరావు నక్కిన కెరీర్ లో ఈ మూవీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. 

అయితే థియేటర్స్ లో ఫెయిల్ అయిన మజాకా మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్న ఈ మూవీ తాజాగా మరొక ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా కూడా తాజాగా అందుబాటులో వచ్చింది. కాగా ఆమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. 

READ  Allu Arjun Pushpa 3 Release Confirm అల్లు అర్జున్ 'పుష్ప - 2' రిలీజ్ కన్ఫర్మ్

వాస్తవానికి ఈ మూవీకి రిలీజ్ కి ముందు ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. దానికి బాగానే రివ్యూస్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా మాత్రం మజాకా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మరి అమెజాన్ లో ఇది ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories