ఇటీవల కొద్దిరోజులుగా నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో పెద్ద వివాదమే జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన పై చిన్న కుమారుడు మనోజ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, అలానే మనోజ్ పై కూడా అతని నుండి ప్రాణభయం ఉందని మోహన్ బాబు కేసు పెట్టిన విషయం తెలిసిందే .ఇటీవల కొన్నాళ్లుగా వీరి కుటుంబ వివాదం మరింతగా ముదురుతోంది.
తాజాగా తన తల్లి పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకంగా తన ఇంటికి విచ్చేసిన సోదరుడు విష్ణు తన పై మరొకసారి కుట్ర ప్లాన్ చేసారని, ముఖ్యంగా బౌన్సర్లతో కలిసి దాడి చేయబోవడం, అలానే ఇంట్లో జెనరేటర్ పనిచేయకుండా పంచదార పోశారని మనోజ్ ఆరోపించారు. తాజాగా ఈ విషయమై మనోజ్ తల్లి నిర్మలా దేవి పోలీసులకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసారు. నిజానికి నిన్న జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన పెద్ద కుమారుడు విష్ణు తమ ఇంట్లో ఎటువంటి గొడవ చేయలేదని, పుట్టినరోజు వేడుకల అనంతరం తన సామాన్లను మాత్రమే తీసుకెళ్లాడని అన్నారు.
ఇదంతా మనోజ్ కావాలని అతడిపై చేస్తున్న ఆరోపణ మాత్రమే అని చెప్పారు. కాగా మంచు విష్ణు తల్లి విద్యాదేవి ఎప్పుడో మరణించడంతో అనంతరం ఆమె సోదరి నిర్మలని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు, ఆమెకు కలిగిన సంతానమే మనోజ్. మొత్తంగా తన సొంత కుమారుడు మనోజ్ పై నిర్మలా దేవి ఇచ్చిన స్టేట్మెంట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.