Homeసినిమా వార్తలురెంటల్ పద్ధతిలో OTTలో స్ట్రీమింగ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్

రెంటల్ పద్ధతిలో OTTలో స్ట్రీమింగ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్

- Advertisement -

మణిరత్నం కెరీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలయింది. ప్రస్తుతానికి, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు.

విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో నాన్‌రెంటల్ ప్రాతిపదికన అందరికీ అందుబాటులో ఉండేలా విడుదల కానుంది.

ప్రస్తుతానికి, వీక్షకులు పొన్నియిన్ సెల్వన్‌ని చూడాలంటే 199 చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కి OTT ప్రతిస్పందన చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే OTT లో బాగా పాపులర్ అయితే త్వరలో విడుదల కానున్న సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంలో సహాయపడుతుంది.

రిలీజ్ కు ముందు నుంచే తమిళ సినీ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు పొన్నియిన్ సెల్వన్ సినిమా పై ఎంతో ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తమిళ మార్కెట్‌లో అనూహ్యమైన బిజినెస్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే సీక్వెల్ అన్ని భాషల్లో సరైన విధంగా ప్రభావం చూపించాలంటే మాత్రం OTT లో ప్రేక్షకుల స్పందన అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. గతంలో కేజీఎఫ్ మొదటి భాగం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన తర్వాత విశేష స్థాయిలో వీక్షకుల నుండి స్పందన తెచ్చుకుంది.

READ  కాంతార తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా - ప్రభాస్

పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు భాగాలకు కలగలిపి 500 కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం జరిగింది. మణిరత్నం కి ఉన్న మార్కెట్ ఇమేజ్ దృష్ట్యా ఇది చాలా భారీ బడ్జెట్ అని, అంతే కాకుండా సినిమా అటు ఇటు ఐతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది అని అందరూ బలంగా విశ్వసించారు.

అయితే తమిళనాట మరియు ఓవర్సీస్‌లో పొన్నియిన్ సెల్వన్ చిత్రం అసాధారణ రీతిలో ప్రదర్శింపబడి అద్భుత విజయం సాధించడంతో నిర్మాతలకు లాభాల పంట పండింది. ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం పై అంతటా భారీ ఆసక్తి నెలకొంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఓవర్సీస్ వద్ద 20 మిలియన్ మార్కుకు చేరువలో పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories