Homeసినిమా వార్తలుమణిరత్నం ఏ రియల్ ప్యాన్ ఇండియా స్టార్ - శంకర్

మణిరత్నం ఏ రియల్ ప్యాన్ ఇండియా స్టార్ – శంకర్

- Advertisement -

గత కొన్ని సంవత్సరాలుగా, భారతీయ సినీ పరిశ్రమల మధ్య ప్రాంతీయ హద్దులు తొలగిపోయి ప్యాన్-ఇండియా సినిమా అనే కొత్త సినిమా పుట్టుకొచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు విడుదలయ్యే దాదాపు ప్రతి చిత్రం అన్ని భాషలలోకి డబ్ చేయబడి, మొత్తంగా ఐదు భాషలలో విడుదల అయ్యే కొత్త సంస్కృతి మొదలయింది. అదే క్రమంలో పాన్-ఇండియా స్టార్స్ అనే కొత్త పదం కూడా ఏర్పడింది.

అలా పిలవబడేందుకు అర్హత కలిగిన మొదటి వ్యక్తి ప్రభాస్ అయితే, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇతర హీరోలు ఆ జాబితాలో చేరారు. అయితే హీరోలతో పాటు దర్శకులు కూడా ఇలాంటి ఖ్యాతిని గడించే దిశలో దూసుకుపోతున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి ఈ వరుసలో ప్రప్రథమ స్థానంలో ఉన్నారు. అయితే ఇంతకుముందే చాలా ఏళ్ళ తరబడి అలాంటి ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రభావవంతమైన సినిమాలు అందించిన దర్శకులు ఒకరు ఉన్నారు.. ఆయనే మణిరత్నం.

తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిన్న జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకలో దర్శకుడు శంకర్ చెప్పినట్లుగా, మణిరత్నం నిజమైన పాన్-ఇండియన్ స్టార్. నిజానికి అలాంటి పేరూ పద్ధతి ఎవరూ చెప్పకుండానే మణిరత్నం తను తీసే సినిమాల ద్వారా ఈ ధోరణిని ప్రారంభించారు. ఆయన సినిమాలు ఎలాంటి భాషాభేదం లేకుండా తెరకెక్కి ప్రేక్షకులని అలరించాయి. పల్లవి అను పల్లవి, బొంబాయి, రోజా, మౌన రాగం మరియు గీతాంజలి వంటి ఆయన సినిమాలు సరిహద్దులు దాటి యావత్ భారతదేశ ప్రేక్షకుల చేత ఆదరించిబడ్డాయి.

READ  రంగ రంగ వైభవంగా - ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాల మొదటి రోజు టాక్

అయితే ఈ క్రమంలో దర్శకుడు శంకర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. గీతాంజలి సినిమా తనను దర్శకుడిగా మారడానికి స్ఫూర్తిగా నిలిచింది అని శంకర్ తెలిపారు. గీతాంజలి నేరుగా తెలుగు సినిమాగా విడుదలైనా, ఇతర దక్షిణాది ప్రాంతాలతో పాటు హిందీలో కూడా చక్కని ఆదరణ పొందింది.అంతే కాకుండా, మణిరత్నం ఆ తరువాత అనేక హిందీ చిత్రాలకు పని చేసారు. ప్రతి భాషలోనూ ఒక సినిమా తీసిన ఏకైక దర్శకుల్లో ఒకరుగా నిలిచారు. అలా చూసుకుంటే ఆయన ఒక ట్రెండ్‌ని సృష్టించారు, అలాగే తేసే ప్రతి సినిమాతో ప్రమాణాలను పెంచుకుంటూ పోయారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఇన్ని సినిమాల తరువాత, మణిరత్నం ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

సెప్టెంబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ, జయరామ్, జయం రవి, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ఐశ్వర్య లక్ష్మి, రెహమాన్ మరియు ఇతర పాత్రలలో భారీ తారాగణంతో సినిమా తెరకెక్కింది.

READ  Box-Office: దుల్కర్ సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సీతారామం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories