Homeసినిమా వార్తలుPS-1: అద్భుతంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్

PS-1: అద్భుతంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్

- Advertisement -

లెజెండరీ డైరెక్టర మణిరత్నం తెర‌కెక్కించిన చారిత్రాత్మక పోరాట గాథ ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 (PS-1)’ నిన్ననే విడుదలయింది. సెప్టెంబర్ 6 మంగళవారం నాడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ చిత్రం ఆడియో స‌హా ట్రైల‌ర్ ని రిలీజ్ చేసారు. ట్రైల‌ర్లో ఊహించినట్టే ఒక చారిత్రాత్మక రాజకుటుంబం నేపథ్యాన్ని చూపించింది. కాగా తమిళ వెర్షన్ కు కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగు వెర్షన్ కు రానా వాయిస్ ఓవ‌ర్ తో ఇచ్చారు.

ఈ కథ రాజ్యాధికారం కోసం జరిగే పోరాటం నేప‌థ్యంలో సాగ‌నుంది. యువరాజు ఆదిత్య కరికాలుడి ఇచ్చిన సందేశాన్ని అందించడానికి చోళ రాజ్యానికి వెళ్లిన వందియడేవుడు చుట్టూ సినిమా సాగుతూ అతని పాత్ర నుంచే ఈ సినిమా ముందుకి సాగుతుంది. చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలుడిగా న‌టించ‌గా .. అతని స్నేహితుడు వందియడేవుడుగా కార్తీ నటించారు. ఐశ్వర్య రాయ్ రాణి నందినిగా న‌టించ‌గా..చోళ యువరాణి కుందవై పాత్రలో త్రిష నటించారు. జయం రవి అరుల్మొళి వర్మ (పోన్నియిన్ సెల్వన్) పాత్రను పోషించారు. అత‌నిదే టైటిల్ రోల్ గా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి రాజుల నేపథ్యంలో కథ అంటే అందులో రాజ్యం కోసం రాజ్యాధికారం కోసం చేసే పోరాటంతో పాటు కుట్ర‌లు కుతంత్రాలు ,మోసం చేసే కుయుక్తులు వంటివి ఎన్నో ఉంటాయి. సొంత కుటుంబీకుల మధ్యే భారీ యుద్ధాలు కూడా జరుగుతాయి.

పీఎస్ -1 చిత్రంలో అలాంటి అన్ని అంశాలూ ఉంటాయి. యుద్ధ సమయంలో దండ‌యాత్ర‌కు బ‌య‌ల్దేరే నావ‌లు, భారీ పోరాటాల అల్ల‌క‌ల్లోల వాతావ‌ర‌ణంతో పాటు యువ‌రాణితో రాకుమారుడి రొమాన్స్ కూడా కలగలిపి షడ్రుచుల సమ్మేళనంగా పీఎస్ 1 తెర‌కెక్కింది. కాగా కార్తీ పాత్ర ఇందులో కాస్త కామెడీ ట‌చ్ తో ఉండి సినిమాలో అంతో ఇంతో రిలీఫ్ ఇచ్చే పాత్ర ఇదేనని ట్రైలర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక అందాల రాశి ఐశ్వ‌ర్యారాయ్ పాత్ర తీరు చూస్తే విల‌న్ ట‌చ్ ఉన్న పాత్రలో ఉన్నట్లు అనిపిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 1954లో ప్రచురించబడిన కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి రెండు నవలల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం.

READ  IFFM అవార్డులకు ఎంపికైన సూర్య జై భీమ్

ఇక ఈ చిత్రం ఆడియో నిన్న అంగ రంగ వైభవంగా జరిగింది. సూప‌ర్ స్టార్ రజనీకాంత్ .. విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వెంకటేశన్ – దర్శకుడు శంకర్ – సంగీత విద్వాంసులు యువన్ శంకర్ రాజా- సంతోష్ నారాయణన్ – విక్రమ్- ఐశ్వర్యరాయ్- త్రిష కృష్ణన్- కార్తీ – జయం రవి సహా ఇతర తారాగణం ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నియిన్ సెల్వన్ రచయిత కల్కి మనవరాలు గౌరీ నారాయణన్ కూడా పాల్గొన్నారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా తమిళం- మలయాళం- కన్నడ- తెలుగు- హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ దాదాపు మూడు లక్షల వ్యూస్ సాధించింది. దాన్ని బట్టి ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది స్పష్టం అవుతుంది. ఐదు భాషల్లో విడుదలైన PS1 ట్రైలర్ కు తమిళంలో నటుడు కమల్ హాసన్.. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగులో రానా దగ్గుబాటి .. కన్నడకు జయంత్ కైకిని .. హిందీకి అనిల్ కపూర్ వాయిస్ ఓవ‌ర్ ల‌ను అందించారు.

కాగా బాహుబలి వంటి అత్యత్భుత సినిమాల తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, దసరా సెలవుల సమయంలో పీఎస్-1 విడుదల అవుతుండటంతో అదే వారంలో విడుదలయ్యే మెగాస్టార్ గాడ్ ఫాదర్ మరియు నాగార్జున ది ఘోస్ట్ సినిమాలపై మణిరత్నం మ్యాజిక్ ప్రభావం చూపే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

సెప్టెంబర్ 30న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ ను.. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం ఎంతో ఇష్టంగా ఎన్నో ఏళ్ళు కలలు కని తెరకెక్కించారని చెబుతున్న ఈ సినిమా.. భారత దేశంలోనే ఇప్పటివరకు తెర‌కెక్కించిన‌ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి. దర్శకుడు మణిరత్నంతో పాటు రచయితలు జయమోహన్ – కుమారవేల్ స్క్రీన్ ప్లే రాశారు. శోభితా ధూళిపాళ – శరత్ కుమార్- ఐశ్వర్య లక్ష్మి – ప్రభు- శరత్ కుమార్- పార్థిబన్- విక్రమ్ ప్రభు- ప్రకాష్ రాజ్- జయరామ్- జయచిత్ర, రెహమాన్, అశ్విన్ కాకుమాను, కిషోర్, నిజల్‌గల్ రవి మరియు వినోదిని ఈ చిత్రంలో నటించారు.

READ  ఈ వారం OTT లో విడుదల కానున్న సినిమాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories