Homeసినిమా వార్తలు'భైరవం' ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్ 

‘భైరవం’ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్ 

- Advertisement -

మంచు మోహన్ బాబు కుటుంబంలో కొన్నాళ్లుగా మనస్పర్ధలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ విషయమై వారి కుటుంబంలో జరిగిన పలు ఘటనలు కూడా ఇటీవల మీడియా మాధ్యమాల్లో విశేషంగా వైరల్ అయ్యాయి. అటు విష్ణు ఇటు మనోజ్ ఇద్దరు మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితులు నెలకొన్నట్టు స్పష్టమవుతోంది.

ఇక తాజాగా మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ సినిమా భైరవం. తాజాగా జరిగిన ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మంచు మనోజ్  ఎమోషనల్ గా మాట్లాడారు. నిజానికి తమ కుటుంబం తన నుంచి కారుతో పాటు అన్ని ఆస్తులు లాక్కున్నారని ఒకరకంగా ఇది బలవంతం చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినప్పటికీ కూడా తనకోసం అనేకమంది అభిమానులు కార్లు ఇవ్వటానికి తమవంతుగా తనకి సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఎమోషనల్ అయ్యారు. సోదరుడిగా తనని ఇంటి నుండి అందరికీ దూరం చేసినప్పటికీ తాను ఎప్పటికీ కూడా మంచు మోహన్ బాబు కుమారుడినే అనే విషయాన్ని గట్టిగా చెప్పుకొచ్చారు మనోజ్.

READ  రూ. 200 కోట్ల క్లబ్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'

భైరవం సినిమా ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ వంటి స్నేహితులు దొరకడం ఆనందంగా ఉందని అన్నారు. తప్పకుండా మూవీని అందరూ థియేటర్స్ లో చూడాలని చెప్పుకొచ్చారు మంచు మనోజ్.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories