Homeసినిమా వార్తలుకోబ్రా చిత్రం నిడివి తగ్గించిన చిత్ర బృందం

కోబ్రా చిత్రం నిడివి తగ్గించిన చిత్ర బృందం

- Advertisement -

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం కోబ్రా ఈ ఆగష్టు 31 న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు విమర్శకుల నుంచి కాస్త మిశ్రమ స్పందన లభించినా . బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం పట్ల హైప్ కారణంగా కలెక్షన్లు బాగానే వచ్చాయి, అయితే సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉన్న కారణంగా ప్రేక్షకుల నుండి టాక్ మాత్రం కాస్త నెగటివ్ గా వచ్చింది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 183 నిమిషాలు చాలా ఎక్కువ లెంగ్త్ అని ప్రేక్షకులు భావించారు. విక్రమ్ నటనకు చాలా ప్రశంసలు లభించగా, సినిమాకు నిడివి మాత్రమే ప్రధాన సమస్యగా టాక్ వచ్చింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కోబ్రా చిత్ర బృందం కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు.

దాదాపు 40 నిమిషాల పాటు సినిమాను తగ్గించాలని కోబ్రా చిత్ర బృందం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సినిమాను 183 నిమిషాల నుంచి 144 నిమిషాలకు కుదించారు. అవసరం లేని సన్నివేశాల గురించి ప్రేక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో, నిడివి తగ్గించి సినిమాను మరింత ఆసక్తికరంగా మలచే విధంగా ఉండటం కోసం అలాంటి సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించుకున్నారట.

READ  IFFM అవార్డులకు ఎంపికైన సూర్య జై భీమ్

ఇక నిడివి తగ్గించిన తరువాత కోబ్రా సినిమా కొత్త వెర్షన్ నేటి సాయంత్రం షోల నుండి ప్రదర్శించబడుతుంది. ఆ రకంగా నిడివి ఎక్కువైందని భావించిన ప్రేక్షకులను మరోసారి థియేటర్ల వద్దకు రప్పించే ప్రయత్నం ఇది. లెంగ్త్ మరియు కొన్ని అనవసరమైన సన్నివేశాల గురించి మాత్రమే ప్రధానంగా ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు కాబట్టి, ఆ నిడివి తగ్గిందని తెలిస్తే వెండితెర పై విక్రమ్ మ్యాజిక్‌ను చూడటానికి ప్రేక్షకులు మళ్ళీ థియేటర్‌లకు తరలి వచ్చే అవకాశం ఉంది.

కోబ్రా సినిమాలో విక్రమ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, మరో ముఖ్య పాత్రలో ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి, రోషన్ మాథ్యూ మరియు కెఎస్ రవికుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు కాగా ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Thank you movie: థాంక్యూ సినిమా సెన్సార్ మరియు ప్రీమియర్ షో డిటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories