సినిమా పేరు: మహావతార్ నరసింహ
రేటింగ్: 3/5
దర్శకుడు: అశ్విన్ కుమార్
నిర్మాతలు: శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్
విడుదల తేదీ: 25 జూలై 2025
ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన డివోషనల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ తాజాగా పలు పాన్ ఇండియన్ భాషల్లో ఆడియన్సు ముందుకి వచ్చింది. మరి ఈ మావోయి ఎంతమేర ఆకట్టుకుంది, ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది మొత్తం ఇప్పుడు రివ్యూలో చూద్దాం
కథ :
ఈ కథ ముఖ్యంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుల పుట్టుక నుండి ఆరంభం అవుతుంది. దితి మరియు కశ్యప మహాముని దంపతులకు వీరిద్దరూ జన్మిస్తారు. అయితే రాక్షస గణాన వారు సంగమించడం వలన వీరిద్దరూ పుడతారు.
అయితే ఈ సోదరులిద్దరూ కూడా శుక్రాచార్యుని వద్ద పెడుతూ దేవతలందరి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. అయితే శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని హతమారుస్తాడు. దానితో కఠోర దీక్ష చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకుని చావులేని వరం పొందుతాడు హిరణ్యకశిపుడు.
అయితే హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీమహా విష్ణువు యొక్క భక్తుడిగా మారి తండ్రి మాటని పాటించడు. దానితో ఆగ్రహం వచ్చిన హిరణ్యకశిపుడు అతడిని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే ప్రహ్లాదుడిని శ్రీమహావిష్ణువు రక్షిస్తాడు. ఆ తరువాత శ్రీహరిని చూపించమని స్థంభం బద్దలుకొట్టడం, అందులోనుండి నరసింహావతారంలో వచ్చిన మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించడం వంటి అంశాలతో సాగుతుంది.
విశ్లేషణ :
ముందుగా దర్శకుడిగా అశ్విన్ కుమార్ తన ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభతో మహావతార నరసింహ మూవీని ఆడియన్స్ ని ఆకట్టుకునే యాక్షన్, ఎమోషన్, డివోషనల్, అడ్వెంచర్ అంశాలు అన్ని కూడా తెరపై చూపించారు.
అయితే సినిమాలోని ఫస్ట్ సీన్ మనకు గతంలో వచ్చిన పలు సినిమాల్లో చూసినదే. ఇక ప్రహ్లాదుని సంహరించే సమయంలో ఏనుగుల బారి నుండి రక్షింపబడే సీన్స్ బాగుంటాయి. అలానే ఇంటర్వెల్ లో వచ్చే వరాహావతారం సీన్స్ కూడా బాగుంటాయి. ముఖ్యంగా ఆఖరి అరగంట పాటు సాగే నరసింహావతారం సన్నివేశాలు సినిమా మొత్తానికి పెద్ద హైలైట్.
ఆ సీన్స్ లో నరుడు సింహం కలగలిసిన నరసింహావతారా రూపం సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పాటు యానిమేషనల్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే అక్కడక్కడ విజువల్స్ మాత్రం ఆశించిన స్థాయిలో మనల్ని అలరించవు. మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా మనసుని హత్తుకునేలా ఉండవు.
ప్లస్ పాయింట్స్:
- యానిమేషన్ / విఎఫ్ఎక్స్ వర్క్
- వరాహ అవతార్ సీక్వెన్స్
- కీలకమైన సంభాషణలు / సన్నివేశాలు
- నరసింహ అవతార్ యొక్క క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
- కీలకమైన భావోద్వేగ సన్నివేశాలు
- గ్రాఫిక్స్‌తో కూడిన కొన్ని సన్నివేశాలు
తీర్పు :
మొత్తంగా యానిమేషనల్ డివోషనల్ మూవీగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై గ్రాండ్ గా రూపొందిన మహావతార్ నరసింహ మూవీ ఓవరాల్ గా ఆడియన్స్ కి మంచి అనుభూతిని అందిస్తుంది. వరాహావతారం తో పాటు నరసింహావతార సన్నివేశాలు సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్