సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం (SSMB 28) విడుదల తేదీని నిన్ననే ప్రకటించారు. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. దీంతో చాలా మంది మహేష్ అభిమానులు చిత్ర యూనిట్ అందించిన కొత్త అప్‌డేట్ తో సంతోషిస్తున్నప్పటికీ, అదే స్థాయిలో కొంతమంది మహేష్ బాబు అభిమానులు SSMB28 విడుదల తేదీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
ఈ చిత్రం విడుదల తేదీని ఏప్రిల్ 28, 2023గా చిత్ర బృందం ప్రకటించింది, అయితే కొంతమంది అభిమానులు ఈ విడుదల తేదీ పట్ల ఏమాత్రం సంతోషించలేదు. ఇంతకన్నా మంచి విడుదల తేదీలు, హాలీడే అడ్వాంటేజితో అందుబాటులో ఉండటమే దీనికి కారణం. అలాంటపుడు అనవసరంగా ఈ విడుదల తేదీని ఎందుకు ఎంచుకున్నారో అని అభిమానులు కాస్త గందరగోళంలో ఉన్నారు.
సరే అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కూడా అంత తొందరగా అయిపోతుందా అనేది అసలు సమస్య. ఇటీవల తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ షూటింగ్ల పై నిషేధం విధించి, మూడు వారాల్లో ఆ నిషేధం ఎత్తివేసీన విషయం తెలిసిందే. ఆ క్రణలో షూటింగ్ లు మొదలైన రోజు నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినా..ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28 కల్లా అన్ని పనులూ పూర్తి చేసుకుంటుందా అనేది అనుమానమే.
కేవలం హీరో దర్శకుడు అనే వృత్తి పరమైన సంబంధం మాత్రమే కాకుండా మహేష్ మరియు త్రివిక్రమ్ లు వ్యక్తిగతంగా గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా మరియు అతడు వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా చేరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
SSMB28లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించినున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురములో సినిమాకి థమన్ సంగీతం ఎంతగా ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ చిత్రానికి కూడా థమన్ అలాంటి సంగీతం ఇస్తారని ఆశిద్దాం.