టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 నేడు గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అందరి నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో అల్లు అర్జున్ పవర్ఫుల్ యాక్టింగ్ కి అందరి నుండి విపరీతంగా ప్రసంశలు లభిస్తున్నాయి. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో సహా ప్రత్యేకంగా వీక్షించనున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ జర్మనీలో ఉన్నారు.
అయితే గతంలో పుష్ప 1 మూవీ చూసి టీమ్ పై అలానే ప్రత్యేకంగా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు సూపర్ స్టార్. మరి పుష్ప 2 మూవీ చూసిన అనంతరం సూపర్ స్టార్ ఏవిధంగా తన రెస్పాన్స్ అందిస్తారనేది చూడాలి. ఇక పుష్ప 2 మూవీ రెండవ రోజు బుకింగ్స్ పరంగా నార్త్ లో బాగానే రాబడుతున్నప్పటికీ తెలుగులో మాత్రం కొంత డ్రాప్స్ కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి.