Homeసినిమా వార్తలుపాన్ వరల్డ్ సినిమాగా రూపొందనున్న మహేష్ - రాజమౌళి సినిమా

పాన్ వరల్డ్ సినిమాగా రూపొందనున్న మహేష్ – రాజమౌళి సినిమా

- Advertisement -

మహేష్ – రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కనుంది. మహేష్ అభిమానులే కాకుండా సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక సెన్సేషనల్ కాంబో ఇది.

ఈ భాగస్వామ్యం చాలా సంవత్సరాలుగా చర్చల్లో ఉంది. కానీ ట్రాక్ లోకి రావడానికి చాలా సమయం పట్టింది. రాజమౌళి తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో అన్ని భాషా అడ్డంకులను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. కాని తన కథ అక్కడితో ముగియలేదు. ఓటీటీ రిలీజ్ తర్వాత అంతకంతకూ క్రేజ్ పెంచుకుని మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రేక్షకులు మరియు సాంకేతిక నిపుణుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ఆదరణ ఇప్పుడు మహేష్ – రాజమౌళి సినిమాకు పెద్ద వరంగా మారింది.

READ  JRC, N కన్వెన్షన్స్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ.. భావోద్వేగానికి గురైన మహేష్ బాబు

ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ ప్రచారంతో రాజమౌళి బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది మరియు హాలీవుడ్ స్టూడియోలు కూడా ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే తదుపరి చిత్రం కోసం రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఎలాంటి ప్రేక్షకులకైనా నచ్చేలా ఉంటుందని సమాచారం. రాజమౌళి బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ప్రభావాన్ని సృష్టించగలిగే భారతీయ సినిమాగా మహేష్- రాజమౌళి సినిమా నిలిచే అవకాశం ఉంది.

దర్శకధీరుడు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల మీడియా ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలను బట్టి చూస్తే ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక సాహసయాత్ర (globe-trotting adventure) గా ఉండబోతుంది.

ఈ ప్రకటనలు ఇప్పటికే సినిమా చుట్టూ భారీ బజ్ ను సెట్ చేశాయి. మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా తెలుగు, భారతీయ సినీ ప్రేక్షకులకు కూడా గర్వకారణమవ్వాలని ఆశిద్దాం.

READ  త్రివిక్రమ్ ను మెచ్చుకుంటున్న మహేష్ బాబు అభిమానులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories