సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో రమణ గా మరొక్కసారి మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు సూపర్ స్టార్ మహేష్. దాని తరువాత త్వరలో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో కలిసి ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేయనున్నారు సూపర్ స్టార్.
ప్రస్తుతం ఈ మూవీ కోసం ఫుల్ గా బాడీ పెంచడంతో పాటు క్రాఫ్, గడ్డం కూడా పెంచుతున్నారు మహేష్. విషయం ఏమిటంటే, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ ల వివాహ వేడుక నిన్న ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సినీ, క్రీడా, రాజకీయ మరియు ఇతర రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కాగా మన టాలీవుడ్ నుండి కూడా పలువురు నటులు హాజరవగా, ఈ వేడుకలో నిన్న ప్రత్యేకంగా తన భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ వేడుకలో ట్రెండీ స్టైల్ శర్వాణిలో హాజరైన మహేష్ బాబు పై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. ముఖ్యంగా పలువురు నేషనల్ మీడియా సైతం మహేష్ ని ఫోకస్ చేసింది. అంతేకాదు మహేష్ ఫ్యామిలీ ప్రత్యేకంగా హాజరైన ఈ వివాహ వేడుక వీడియోలు, ఫోటోలు నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతూ వైరల్ అవుతున్నాయి. మొత్తంగా నిన్నటి నుండి మహేష్ మ్యానియా సోషల్ మీడియాని ఊపేస్తుందని చెప్పాలి.