తాజాగా తమిళ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల పలు తమిళ సినిమాలు రివ్యూస్ కారణంగా రెవెన్యూ పరంగా దెబ్బతింటున్నాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) వారు మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాని ప్రకారం ప్రతి సినిమా రిలీజ్ కి మూడు రోజుల ముందు వరకు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోను రివ్యూస్ ఇవ్వటానికి వీలులేదని వారు పిటీషన్ వేయడం జరిగింది.
అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు దాన్ని కొట్టి వేసింది. దానితో తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కి షాక్ తగిలినట్లైంది. అయితే దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వారు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమా యొక్క కంటెంట్ బాగుంటే అది పెద్దదైనా, చిన్నదైనా ఎవరైనా చూస్తారని.
అయితే వ్యక్తిగతంగా నటులను టార్గెట్ చేస్తూ రివ్యూస్ రాసే వారికి మాత్రం తామందరం వ్యతిరేకంటున్నారు సోషల్ మీడియా వాసులు. ముఖ్యంగా కంటెంట్ బాగున్న ఎన్నో సినిమాలు సోషల్ మీడియా రివ్యూస్ కారణంగా మంచి విజయం సాధించి మరింతగా రెవెన్యూ అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. కాగా ఈ అంశం పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తమిళ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏ విధంగా తదుపరి ఆలోచన చేస్తుందో చూడాలి.