Homeసినిమా వార్తలు'మ్యాడ్ స్క్వేర్' ఓటిటి డీటెయిల్స్

‘మ్యాడ్ స్క్వేర్’ ఓటిటి డీటెయిల్స్

- Advertisement -

యువ నటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఎంటర్టైన్మెంట్ సినిమా మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే విషయం ఏమిటంటే తాజాగా మాడ్ స్క్వేర్ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. కాగా ఈ సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫిక్స్ ద్వారా ఏప్రిల్ 25 నుంచి పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.

వాస్తవానికి థియేటర్స్ లో ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కు వరకు దూసుకెళ్తుందని అందరూ భావించారు. అయితే ఫస్ట్ వీక్ బాగానే రాబట్టిన మ్యాడ్ స్క్వేర్ సినిమా సెకండ్ వీక్ లో బాగా డల్ అయ్యి ఓవరాల్ గా రూ. 70 కోట్లకు గ్రాస్ దగ్గర ఆగిపోయింది. మరి ఓటిటి ఆడియన్స్ దీనికి ఏ స్థాయిలో రెస్పాన్స్ అందిస్తారో చూడాలి. ఈ మూవీలో సునీల్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు చేశారు.

READ  Robin Hood David Warner First Look Release రాబిన్ హుడ్ : డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories