టాలీవుడ్ నవ దళపతి విజయ్ హీరోగా సాయాజీ షిండే, సాయి చంద్, ఆర్నా,రాజు సుందరం,శశాంక్, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీని వి సెల్యులాయిడ్స్, విఆర్ గ్లోబల్ మీడియా, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై సునీల్ బలుసు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించగా జై క్రిష్ సంగీతం అందించారు.
మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ టీజర్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన మా నాన్న సూపర్ హీరో మూవీ భావోద్వేగ, సంఘర్షణతో నడిచే కథ. అయితే ఫ్లాట్ స్క్రీన్‌ప్లే కారణంగా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాదు. ముఖ్యంగా సాయి చంద్ మరియు హీరో సుధీర్ బాబుల మధ్య సమాంతరంగా నడిచే నాన్ లీనియర్ పెర్స్పెక్టివ్ స్క్రీన్‌ప్లే చాలా తక్కువగా ఉండడంతో పాటు ఎమోషన్ కనెక్ట్ లేకపోవడంతో పాటు బలహీనమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ వంటివి మైనస్.
అలానే కథలోని ఎమోషనల్ డెప్త్ అవసరానికి అనుగుణంగా స్క్రీన్‌ప్లేను ఏకీకృతం చేయడంలో అస్థిరమైన ఎడిటింగ్ కథనానికి ఇబ్బందికరంగా మారింది. ఇక ఆసక్తికరమైన ఎమోషనల్ ఇంటర్వెల్ తర్వాత, కొంతమేర హాస్య భరితమైన సీన్స్ తో నడవడంతో సినిమా పూర్తిగా భిన్నమైన మార్గాన్ని తీసుకుంటుంది. ఇది ఎమోషనల్కనెక్టివిటీకిఅడ్డంకిగా మారింది. కథలోకీలకమైనఎమోషనల్ కంటెంట్ మొదట్లో ఏర్పడి సినిమా ముగిసే సమయానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అలానే హీరో యొక్క లవ్ ట్రాక్ కూడా అలరించదు. మొత్తంగా కథ పాయింట్ పరంగా బాగున్నా
ప్లస్ పాయింట్స్ :
- సుధీర్ బాబు, సాయాజీ షిండే నటన
- ఫస్ట్ హాఫ్ లో సాయాజీ, సుధీర్ బాబుల మధ్య ఎమోషనల్ సీన్స్
- మంచి భావోద్వేగ ఇంటర్వెల్
- ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్
- కథ
మైనస్ పాయింట్స్ :
- ఫ్లాట్ నేరేషన్
- బలహీనమైన బిజీఎం మరియు పాటలు
- ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
- లవ్ స్టోరీకి సంబంధం లేదు
- ఆకట్టుకోని సెకండాఫ్
- మెలోడ్రామాటిక్ డైలాగ్స్
- అస్తవ్యస్తమైన ఎడిటింగ్
తీర్పు : నేడు రిలీజ్ అయిన
మా నాన్న సూపర్ హీరో ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు నుండి వచ్చిన మరో యావరేజ్ చిత్రం. తను అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ, స్క్రీన్‌ప్లే తడబడింది మరియు భావోద్వేగాలు ఆడియన్స్ కి కనెక్ట్ కావు. ఈ మూవీ చూస్తే, దర్శకుడు అభిలాష్ తాను తీసిన విజయవంతమైన లూజర్ వెబ్ సిరీస్ హ్యాంగోవర్ నుండి బయటపడలేదనిపిస్తుంది. అతనితో సహా చిత్రానికి ముగ్గురు రచయితలు ఉన్నప్పటికీ అది బలహీనమైన స్క్రీన్‌ప్లే రచనతో పాటు అస్థిరమైన ఎడిటింగ్ ఈ మూవీకి మైనస్ గా మారాయి.
రేటింగ్ : 2.5 / 5