ఇటీవల మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ సినిమాని వెంకీ అట్లూరి తెరకెక్కించారు.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం అతిపెద్ద విజయం అయితే అందుకుంది. ఇక కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది.
కాగా విషయం ఏమిటంటే 13 వారాలుగా ఓటిటి లో లక్కీ భాస్కర్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా అన్ని భాషల ఆడియన్స్ ఈ మూవీని ఎంతో ఆదరిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఆ విధంగా 13 వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగిన సౌత్ ఇండియన్ మూవీగా లక్కీ భాస్కర్ ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది.
మరోవైపు కలెక్షన్ల పరంగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నటుడిగా దుల్కర్ సల్మాన్ యొక్క ఇమేజ్ ని మరింత పెంచేసింది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు.