Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: లైగర్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Box-Office: లైగర్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

విజయ్ దేవరకొండ “లైగర్” ఈ నెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమాని విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఫస్ట్ షోలోనే మ్యాటర్ లేని సినిమా అని తేల్చేశారు. సాధారణంగా కొన్ని సినిమాలకి ముఖ్యంగా ఈ మధ్య రివ్యూలు అటు ఇటు అయినా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి లైగర్ సినిమా విషయంలో విమర్శకుల మాట, ప్రేక్షకుల మాట ఒకటే అయింది.

లైగర్‌ ను మొదటి రోజు మ్యాట్నీ షో నించే కలెక్షన్లు కిందకి పడిపోతూ వచ్చాయి. రౌడీ స్టార్ – పూరీ జోడీ బాక్సాఫీస్ వద్ద ఇరగదీస్తుంది అనుకుంటే అందరి అంచనాలను త్రుంగలో తొక్కినట్లు గా సినిమా పరిస్థితి ఏర్పడింది. ఆదివారం రోజు కూడా చాలా థియేటర్లు పూర్తిగా ఖాళీగా కనిపించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొదటి రెండు రోజులు కలిపి హిందీలో డబుల్ డిజిట్ నెట్ సాధించినా.. కలెక్షన్లలో ఎదుగుదల లేదు.

మొదటి వారాంతంలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్ల షేర్ వసూలు చేసింది , సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్ షోలతో మొదలై తర్వాత టాక్ పెరిగి ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అంతే కాకుండా ఈ నాలుగు రోజుల్లో వచ్చిన షేర్ ఏ ఇంక దాదాపు క్లోజింగ్ షేర్ గా పరిగణించవచ్చని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా ఈ మూడు రాష్ట్రాల వసూళ్లు ఉమ్మడిగా లెక్కిస్తే దాదాపు 2 కోట్లు వచ్చింది. ఇక సౌత్ ఇండియా మొత్తం మీద 15.5 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం దాదాపు 6.5 కోట్ల షేర్‌తో, 13.5 కోట్ల నెట్‌ను వసూలు చేసింది.

READ  పరంపర వెబ్ సిరీస్ రివ్యూ: ఆకట్టుకున్న రాజకీయ చదరంగం

ఆ రకంగా మొత్తం భారతదేశం షేర్ 22 కోట్లకు చేరుకోగా.. ఓవర్సీస్ షేర్ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వరకు షేర్ సంపాదించింది. ఈ చిత్రానికి అయిన థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు 90 కోట్లు. ఆ రకంగా చూసుకుంటే లైగర్ భారీ నుంచి అతి భారీ నష్టాలను మూట గట్టుకుంది అనే చెప్పాలి.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య పాండే మరియు రమ్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన లైగర్ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా విడుదలైంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మూడు వారాలకే ఓటిటిలో రిలీజ్ అవుతున్న థాంక్యూ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories