Homeసినిమా వార్తలుహ్యపీ బర్త్ డే ట్రైలర్ : వినూత్నమైన హాస్య ప్రయోగం

హ్యపీ బర్త్ డే ట్రైలర్ : వినూత్నమైన హాస్య ప్రయోగం

- Advertisement -

కంటెంట్ ఉంటే కొత్త హీరో/దర్శకుడు అయినాసరే విజయం సాధించచ్చు అని తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నోసార్లు రుజువు అయింది. అలాంటి సినిమాల్లో ఒకటి  “మ‌త్తు వ‌ద‌ల‌రా”. ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్‌.ఎమ్ కీర‌వాణీ చిన్న కొడుకు సింహా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతూ న‌టించిన ఈ చిత్రానికి రితేష్ రాణా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

రితేష్ క‌థ, స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన “మత్తు వదలరా” 2019 లో విడుద‌లైన ఉత్తమ చిత్రాలలో ఒక‌టిగా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత రితేష్ రాణా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్య‌పి బ‌ర్త్‌డే’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇక ఈరోజు విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టే ఉంది. Surreal comedy పేరుతో దర్శకుడు రితిష్ రాణా సరికొత్త ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. No mask no entry అనే బోర్డు కరోనా నేపథ్యంలో అందరికీ పరిచయం అయిన విషయమే. ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చేలా No guns no entry అని చూపించడం భలే ఉండింది. గన్ లైసెన్స్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తేనే అర్ధం అయింది. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తో పాటు దర్శకుడి మొదటి చిత్రంలో ఉన్న కమెడియన్ సత్య,వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య లు ఇప్పుడు హ్యాపీ బర్త్ డే లోనూ కనిపించనున్నారు. మొత్తానికి ఒక వినూత్నమైన హాస్య ప్రయోగం అనిపించే విధంగా ఉంది హ్యాపీ బర్త్ డే ట్రైలర్.

READ  భారీ డిజాస్టర్ గా నిలిచిన అంటే సుందరానికీ

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు కూడా శరవేగంగా జ‌రుపుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.తొలుత ఈ చిత్రాన్ని జూలై 15న విడుద‌ల చేస్తారని ప్రకటించారు. అయితే ఇతర సినిమాల వాయిదాల వల్ల ఒక వారం ముందుగా అంటే జూలై 8న విడుదల చేస్తున్నారు.మైత్రీ మూవీ మేక‌ర్స్, క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  దీపావళికి రానున్న కార్తీ "సర్దార్*


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories