Homeసినిమా వార్తలుKTR: బలగం.. దసరా వంటి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల పై చాలా ఉత్సాహంగా ఉన్న...

KTR: బలగం.. దసరా వంటి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల పై చాలా ఉత్సాహంగా ఉన్న కేటీఆర్

- Advertisement -

తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి మరియు సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేస్తూ, ఈ ప్రాంత నేపథ్యంలో.. ఈ ప్రాంత యాస‌లో చిత్రీక‌రిస్తున్న సినిమాల‌ పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌( CM KCR )కు మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో తిరిగి పురోగతి సాధించడానికి కార‌ణ‌మైన కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌ను హేళ‌న చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. తనకు వ్యక్తిగతంగా వచ్చిన వాట్సాప్ లో వచ్చిన సందేశాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇంతకీ ఆ సందేశంలో ఉన్నది ఏంటంటే..

https://twitter.com/KTRBRS/status/1642047000559652870?t=9RbRawcbJ-wN5V8ubrA3Yg&s=19

డియ‌ర్ స‌ర్(కేటీఆర్‌ను ఉద్దేశించి).. మీతో నేను ఓ రెండు విష‌యాలు పంచుకోవాల‌నుకుంటున్నాను. అందులో ఒక‌టి.. ఈ విష‌యాన్ని మీతో పంచుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ యాస‌లో ఇప్పుడు సినిమాలు రావ‌డం, అవి అద్భుతంగా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు బ‌లగం( Balagam ), ద‌స‌రా( dasara ) లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే ద‌క్కుతుంది.

READ  Pawan Kalyan: సెప్టెంబర్ లో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం

ఇక రెండో విష‌యం ఏంటంటే.. నాకు 68 ఏండ్లు.. ఇలాంటి సినిమాలు వ‌స్తాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విల‌న్లు, జోక‌ర్స్ గా చూపిచండంతో.. గ‌త 20 ఏండ్ల నుంచి సినిమా థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేశాను అని డాక్ట‌ర్ దండే శ్రీరాములు అనే వ్య‌క్తి కేటీఆర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు.

అయితే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాలను కేటీఆర్ గారు మెచ్చుకున్నందుకు కొంతమంది నెటిజన్లు సంతోషించగా, బలగం, దసరా వంటి చిత్రాల విజయాన్ని ఉపయోగించుకుని తన పార్టీని మరియు తండ్రి ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నించినందుకు ఆయన ఉత్సాహం మరియు ప్రయత్నం అనవసరమైనదని మరికొందరు కేటీఆర్ ను విమర్శించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Dil Raju: వారిసు స్పీచ్ ట్రోల్స్‌ కు వేదిక పై స్పందించిన నిర్మాత దిల్ రాజు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories