టాలీవుడ్ గ్లోబల్ ఐకాన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థల పై లేటెస్ట్ గా తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషించగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటించారు.
ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన దేవర పార్ట్ 1 మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ తో కొనసాగుతుండడం విశేషం. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన దేవర పార్ట్ 1 సక్సెస్ కావడంతో దీని సీక్వెల్ అయిన దేవర 2 పై అందరిలో మరింతగా అంచనాలు పెరిగాయి.
విషయం ఏమిటంటే, ఇప్పటికే అయాన్ ముఖర్జీ తీస్తున్న వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి యాక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీని వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 14న వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. అలానే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోన్న ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో కూడా త్వరలో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నారు.
ఇక ఇవి రెండు పూర్తి కావడానికి దాదాపుగా రెండేళ్ళైనా పట్టవచ్చని తెలుస్తోంది. కాగా ఆ తరువాతనే ఎన్టీఆర్ తో కొరటాల దేవర 2 ఉంటుందని టాక్. మొత్తంగా దీనితో కొరటాల ఒకింత డైలమాలో పడ్డారని, మరి దేవర పార్ట్ 2 పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.