Homeసినిమా వార్తలుNTR30: కథను పూర్తిగా మార్చేసిన కొరటాల శివ

NTR30: కథను పూర్తిగా మార్చేసిన కొరటాల శివ

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివల కాంబినేషన్లో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులలో ఎంతో ఉత్సాహంతో నింపింది. సినిమా ఎప్పుడెప్పుడా అని వారు వెయ్యి కళ్ళతో ఎదురుచూడటం మొదలు పెట్టారు. ఈ సక్సెస్ ఫుల్ కాంబో త్వరలో తన మ్యాజిక్‌ను మరోసారి ప్రదర్శిస్తుంది అని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కాగా ఈ చిత్రాన్ని తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని గత సంవత్సరం ప్రకటించారు.

ఎన్టీఆర్ తన 30వ చిత్రానికి ఏ దర్శకుడిని ఎంచుకుంటారు అనే విషయం పై చాలా కాలంగా అనేక ఊహాగానాలు వినిపించాయి. నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా, స్క్రిప్ట్ మరియు షూటింగ్ షెడ్యూల్ లలో మార్పుల కారణంగా ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఉప్పెన లాంటి భారీ విజయం తర్వాత, కొత్త దర్శకుడు బుచ్చి బాబు సానా కూడా ఎన్టీఆర్ 30కి దర్శకత్వం వహించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే అటువంటి పుకార్లు అన్నిటికీ ముగింపు పలుకుతూ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా చక్కగా రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే మేలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

READ  కార్తీకేయ - 2 ప్రమోషన్స్ కు రాలేకపోయాను సారీ అంటున్న అనుపమ

ఆచార్య పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొరటాల శివ ఈ చిత్రం కోసం ఇంతకు ముందు రాసుకున్న కథ కాకుండా మొత్తం కొత్త స్క్రిప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో భారీ విజయం సాధించి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా సమయం కేటాయిస్తున్నట్లు వినికిడి. అందువల్ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఎంత లేదన్నా మరో 2-3 నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ 30 సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories