ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇంకా ఈ మూవీలో జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మొన్న ఈ మూవీ నుండి కిసిక్ అనే పల్లవితో సాగే స్పెషల్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు. అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల చిందేయనున్న ఈ సాంగ్ యొక్క లిరికల్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.
ఈ సాంగ్ ఇప్పటికే 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సౌత్ ఇండియన్ హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు తాజాగా 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. మొత్తంగా మరింత భారీ హైప్ సొంతం చేసుకున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.