Homeసినిమా వార్తలు'కింగ్డమ్' న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘కింగ్డమ్’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కింగ్డమ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ చాలావరకు వేగంగా జరుపుకున్న ఈ సినిమా వాస్తవానికి మే 30 రిలీజ్ అవుతుందని ఇటీవల మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అలానే కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన కింగ్డమ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ తో పాటు ఇతర కొన్ని వర్కులు బ్యాలెన్స్ ఉండటంతో మూవీ రిలీజ్ ని జూలై 4వ తేదీకి వాయిదా వేసినట్టు తాజాగా న్యూ రిలీజ్ డేట్ అయితే మేకర్స్ అనౌన్స్ చేశారు.

మొత్తంగా అయితే జులై 4న మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ కానున్న కింగ్డమ్ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుని విశేషమైన సక్సెస్ అందుకోవటం ఖా యమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫాన్స్ అయితే ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి రిలీజ్ అనంతరం కింగ్డమ్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలంటే మరొక రెండు నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.

READ  'హరి హర వీర మల్లు' : నిర్మాతకు అది దురదృష్టం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories