Homeసినిమా వార్తలుఅస్త్రావర్స్ లో అడుగు పెట్టనున్న రాకీ భాయ్

అస్త్రావర్స్ లో అడుగు పెట్టనున్న రాకీ భాయ్

- Advertisement -

KGF 2 యొక్క భారీ విజయం తర్వాత, హీరో యష్ ఇప్పటివరకు కొత్త సినిమా ఏదీ ప్రారంభించలేదు. కానీ ఆయన తదుపరి చిత్రం గురించి చాలా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ పుకార్లలో ఒకటి రాకీ భాయ్‌కి బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి అనేది అయితే, మరో వైపు ఇటీవల వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో యష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా బాలీవుడ్‌లో హీరో యష్‌కి ఒక భారీ బడ్జెట్‌ పౌరాణిక సినిమాలో నటించే అవకాశం వచ్చిందని మరో ప్రచారం జరుగుతోంది. KGF-2 చిత్రంతో యష్ పాన్-ఇండియన్ స్టార్ అయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూలు చేసి 2022లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ప్రతి యొక్క వెర్షన్ లోనూ ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శింపబడింది.

అలాగే బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో దేవ్ అనే కీలక పాత్రలో యష్ కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలో రణబీర్‌ కపూర్‌తో సమానంగా యష్‌ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు.

READ  రిలీజ్ డేట్ విషయంలో గందరగోళంలో ఉన్న ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు

బ్రహ్మాస్త్ర పార్ట్1 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద చక్కని ప్రదర్శన ఇచ్చింది. అంతే కాక వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు ఊపిరి పోస్తూ పోస్ట్ కోవిడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిచింది. కాగా బ్రహ్మస్త్ర మొదటి భాగం దేవ్ పాత్ర పరిచయంతో అత్యద్భుతంగా ముగుస్తుంది.

అప్పటి నుంచి దేవ్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం, బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఆ పాత్ర కోసం యష్ ను ఎంపిక చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

కాగా వారు ఇప్పటికే యష్‌ని సంప్రదించారని, మరియు ఏ నిర్ణయం తీసుకోవాలనేది యష్‌ పై ఆధారపడి ఉందని సమాచారం. ఈ వార్త నిజం అయితే మటుకు ఒక్కసారిగా బ్రహ్మాస్త్ర సీక్వెల్ కు హైప్ పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక KGF 2 విడుదలైనప్పటి నుండి, KGF-3 గురించి చాలా పుకార్లు వస్తున్నాయి. ఈ చిత్రం ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని, అంతే కాకుండా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి కూడా వెళ్తుందని కొందరు అంటున్నారు.

READ  మలయాళంలోనూ విడుదల కానున్న గాడ్ ఫాదర్.. అందరినీ ఆశ్చర్యపరిచిన మెగాస్టార్

అలాగే దర్శకుడు నార్తన్ తో యష్ సినిమా చేయబోతున్నారని కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన తదుపరి సినిమా గురించి యష్ నుండి అధికారిక ధృవీకరణ వచ్చినప్పుడు మాత్రమే ఈ పుకార్లన్నీ ఆగిపోతాయి. లేదంటే ఈలోపు ప్రతి కొత్త సినిమాకి యష్ పేరు జోడించేలా ఉన్నారు సినీ ఔత్సాహికులు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories