కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక దాని తర్వాత ఒక్కో రికార్డులను బద్దలు కొడుతూ వెళుతుంది. నిఖిల్ నటించిన ఈ చిత్రం ఇటీవలే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇక మరి కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ఈచిత్రం మరో అరుదైన మైలురాయిని సాధించింది. కార్తికేయ 2 ఇప్పుడు US బాక్సాఫీస్ వద్ద $1.5 మిలియన్ల మార్కును తాకింది, ఇది నిజంగా అత్యద్భుత ప్రదర్శన అని చెప్పాలి.
అసలు చిన్న సినిమాలకు $1 మిలియన్ మార్క్ దాటడం అనేది ఒక భారీ లక్ష్యం. అంతే కాదు యుఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లను సాధించడం చిన్న సినిమాలకు కలగా చెప్పచ్చు. అలాంటిది కార్తికేయ 2 కోన్ని రోజుల క్రితం $1 మిలియన్ మార్కును దాటి ఈ శనివారంతో ఏకంగా 1.5 మిలియన్లను దాటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా డే సందర్భంగా పెట్టిన 3$ ఆఫర్ ఈ సినిమాకు చాలా బాగా ఉపయోగ పడింది.
అలాగే సినిమా విడుదలై నాలుగు వారాలు దాటిన తరువాత కూడా 30K కంటే ఎక్కువ ఫుట్‌ఫాల్‌లను సాధించింది అంటే ఇది అసాధారణమైన విజయం అనే చెప్పాలి. కార్తీకేయ 2 చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ క్రమంగా నిలకడగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆఫర్ వల్ల ఓవర్ సీస్ లో వసూళ్లు ఊపందుకున్నాయి. అందువల్ల గత వారంలో లాగా ఈ వారాంతంలో కూడా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇది ఒక చిన్న చాలా అరుదైన రికార్డు.
కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కనబర్చిన అసాధారణ ప్రదర్శన ట్రేడ్ సర్కిల్‌లకు ఆశ్చర్యంతో చాలా కాలం తరువాత ఇంత లాంగ్ రన్ ఉన్న సినిమా రావడం వారికి భారీ ఉపశమనం కలిగించింది. 2014 చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 లో సినిమాలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు అనుపమ్ ఖేర్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు.టైటిల్ రోల్ లో నిఖిల్ నటన, చందూ మొండేటి పకడ్బందీ కథనంకు తోడు కాల భైరవ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
ఈ చిత్రం హిందీలో కూడా అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఇప్పటి వరకూ బాలీవుడ్ మార్కెట్లో 25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది.