నిఖిల్ కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదలైనప్పటి నుంచీ ఈ చిత్రం విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అంటే ఉత్తరాదిన కూడా తన హవాను కొనసాగిస్తోంది.
లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ వంటి బాలీవుడ్ చిత్రాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. నిజానికి, నాలుగో రోజు కంటే కలెక్షన్లు మూడవ రోజు , మూడవ రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా ఆడుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం USAలోనే $600K+ గ్రాస్‌తో ఓవర్సీస్ మార్కెట్‌లలో కూడా చాలా బాగా కలెక్షన్లు నమోదు చేసింది. సరైన ప్రచారం లేకుండా, తెలియని ప్రాంతంలో ఇలాంటి కలెక్షన్లు సాధించడం సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
మొదటి వారాంతంలో రికార్డు స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లు సాధించి చిన్న హీరో చిత్రాలలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. అంతే కాక కార్తీకేయ 2 సినిమా డ్రీమ్ రన్ ఇంకా పూర్తి కాలేదు. కేవలం వీకెండ్ లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా నడుస్తోంది. ఆ క్రమంలో కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇవి సినిమా యొక్క అన్ని వెర్షన్‌లతో కలుపుకుంటే వచ్చిన టోటల్. నిఖిల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే.
ఈ ఊపు చూస్తుంటే కార్తికేయ 2 సినిమా ఈ వీకెండ్ నాటికి 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసేందుకు రెడీ అవుతుంది. మరి కొన్ని రోజులు ఇలానే లాంగ్ రన్ వస్తే 40 కోట్ల షేర్ క్లబ్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకులకు కార్తీకేయ 2 సినిమా ఓకే ఒక్క ఆప్షన్ గా ఉండి ఆనందింపజేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.