కాంతార చిత్రం కన్నడలో ఘనవిజయం సాధించి తెలుగులోనూ పెద్ద హిట్‌గా నిలిచింది. నిజానికి తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాలో నటీనటుల వివరాలు ఏమి తెలియదు. ట్రైలర్ బాగున్నా పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కానీ సినిమా విడుదలైన తరువాత అద్భుతమైన టాక్ ద్వారా తెలుగు వెర్షన్లో ఏకంగా 32.5 కోట్ల షేర్ సాధించింది. ఇది వెండితెర పై తెలుగు ప్రేక్షకులకు కొత్తరకం సినిమాల పట్ల ఇష్టాన్ని.. ఇతర సంస్కృతుల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.
ఈ జానపద థ్రిల్లర్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా రన్ అవుతోంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం తెలంగాణలో 12.5 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌లో 15 కోట్లకు పైగా షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు డబ్ తెలుగు వెర్షన్ 28 కోట్లు రాబట్టింది.
కాంతార తెలుగు వెర్షన్ ఇండియాలోని మిగతా ఏరియాలు మరియు ఓవర్సీస్‌లో వచ్చిన కలెక్షన్లు కలుపుకుని ఓవరాల్‌గా 4.5 కోట్లు రాబట్టింది. తెలుగు కాంతార ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన మొత్తం షేర్ 32.5 కోట్లు. ఎలాంటి సందడి లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ఈ కలెక్షన్లు నిజంగా సంచలనాత్మకమైనవే కాకుండా ఎవరూ ఊహించనివి.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించింది కథానాయకుడు రిషబ్ శెట్టినే. పెద్దగా ప్రమోషన్‌లు లేదా సూపర్‌స్టార్‌లతో కూడిన భారీ స్థాయి ఈవెంట్‌లు లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాడంబరంగా ప్రారంభమైంది. కానీ ముందుగానే చెప్పుకున్నట్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరి నోటి వెంట అదిరిపోయే స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రానికి వచ్చిన స్పందన అందులో ఉన్న ఆసక్తికరమైన కంటెంట్ యొక్క శక్తిని రుజువు చేస్తుంది.
ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో పాతుకుపోయిన సంస్కృతిని మిళితం చేస్తుంది. చాలామంది రంగస్థలంతో ఈ సినిమాలో సారూప్యతలను కనుగొన్నారు. అయితే సినిమా పై ప్రేక్షకుల తీర్పు మొత్తంగా అద్భుతంగా ఉంది.
దసరా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ డల్ ఫేజ్‌గా పరిగణించబడుతుంది. పెద్ద పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాని విడుదల చేయడానికి సాహసించరు. అయితే, సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా, ఊర్వశివో రాక్షసివో వంటి అనేక సినిమాలు విడుదలయ్యాయి. అయితే కాంతార చూపించిన ప్రభావంతో పోలిస్తే సర్దార్ మినహా ఇతర చిత్రాలు ఎక్కడా సమీపంలో కూడా లేవు.
కాంతారకు పోటీ ఇస్తున్న ఏకైక చిత్రం యశోద. ప్రేక్షకులు ఉత్తేజకరమైన థియేట్రికల్ అనుభవం కోసం ఎదురుచూస్తున్నారని మరియు OTTలోనే పెద్ద తేడా లేకుండా చూడగలిగే సినిమాలను ఆదరించడం లేదని ఈ సందర్భంగా రుజువు అవుతోంది.
తెలుగు చిత్ర నిర్మాతలు కాంతార యొక్క విజయంతో ప్రేక్షకుల ఇష్టాలను అర్థం చేసుకుంటారని మరియు అందుకు అనుగుణంగా సినిమాలు చేస్తారని గమనిస్తారని ఆశిద్దాం. మహిళలు, పిల్లలు కాంతార సినిమాను ప్రోత్సహించడం ఆ చిత్రం యూనివర్సల్ హిట్ కావడానికి దోహదపడింది.