కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి గత చిత్రం కాంతార సినిమాకు భారీ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటగా కన్నడలో మాత్రమే విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ చేశారు.
ఎవరూ ఊహించని విధంగా తెలుగు, హిందీలో భారీ కలెక్షన్లను రాబట్టింది కాంతార. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా రెండో పార్ట్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రిషబ్ శెట్టి ఓ తెలుగు యువ హీరోతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి సంభందించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిషబ్ శెట్టి ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అయితే ఈ వార్తలను ధృవీకరించని రిషబ్ శెట్టి తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచన ఇప్పట్లో లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, మొదటి భాగానికి ప్రీక్వెల్ గా కాంతారా 2 తెరకెక్కించబడింది. ఇది గ్రామస్థులు, రాజు మధ్య సంబంధాన్ని మరింత అన్వేషిస్తుంది. గ్రామస్తులను, చుట్టుపక్కల భూములను రక్షించడానికి రాజు దైవంతో అంగీకరిస్తాడు, కాని రాజు మనవడి అత్యాశ కారణంగా పరిస్థితులు అనుకున్న విధంగా జరగవు. తద్వారా ఏర్పడే మనిషి మరియు ప్రకృతి మధ్య యుద్ధం ఈ సినిమా ప్రధానాంశంగా ఉండబోతుంది.