Homeబాక్సాఫీస్ వార్తలుబాక్సాఫీస్ వద్ద తగ్గని కాంతార జోరు.. హిందీలో మొదటి వారం కన్నా రెండవ వారం ఎక్కువ...

బాక్సాఫీస్ వద్ద తగ్గని కాంతార జోరు.. హిందీలో మొదటి వారం కన్నా రెండవ వారం ఎక్కువ వసూళ్లు

- Advertisement -

కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతార చిత్రం విడుదలై నాలుగు వారాలు కావస్తున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఇక అదే కోవలో ఈ వారం తన జాబితాలో మరో రికార్డుని చేర్చుకుంది. ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కును దాటింది మరియు అన్ని భాషలలో హౌస్‌ఫుల్స్ నమోదు చేస్తూ తన జోరుగా కొనసాగిస్తుంది. ఇప్పట్లో ఈ జోరు ఆగేలా లేదు. తెలుగు వెర్షన్లో కాంతార ఇప్పటికే 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

హిందీ వెర్షన్ కూడా కాంతార అద్భుతంగా ప్రదర్శింపబడుతుంది. కాగా హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రెండవ వారం కూడా విశేష స్థాయిలో స్పందన వచ్చింది. మొదటి వారంలో 15 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారంలో దాదాపు 17కోట్ల వసూళ్లను రాబట్టింది.

మొత్తంగా ఇప్పటి వరకూ 32 కోట్ల నెట్ సాధించగా.. మూడవ వారంలో KGF 1 హిందీ కలెక్షన్ లను సునాయాసంగా దాటుతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కాగా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో 50 కోట్ల నెట్‌ వసూలు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు మరియు ప్రేక్షకుల నుండి అపారమైన ఆదరణను సంపాదించి ఏకగ్రీవ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

READ  తెలుగు వెర్షన్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన కాంతార

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 250 కోట్ల వసూళ్లు చేసే విధంగా దూసుకు పోతుంది. పైగా ఇదే జోరు కొనసాగితే 300 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన కాంతార సినిమా అటు ప్రేక్షకులనే కాకుండా ప్రాంతాలకు అతీతంగా అన్ని చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల చేత కూడా ప్రశంసలు అందుకుంటూ సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇటీవలే సినిమా చూసిన సూపర్ స్టార్ రజినికాంత్ కూడా ఇదొక మాస్టర్ పీస్ అని కితాబు ఇచ్చారు.

ఏదో ఇప్పుడు మార్కెట్ ఉంది కదా అని అన్ని భాషల్లో సినిమాని విడుదల చేయడం కాకుండా సరైన కంటెంట్ తో ఒక సినిమాని తెరకెక్కిస్తే అదే అందరినీ అలరించే సినిమా అవుతుందని మరొక్కసారి కాంతార సినిమాతో రుజువు అయ్యింది.

Follow on Google News Follow on Whatsapp

READ  బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories